సిటీబ్యూరో: తాగునీటిని అందించే ప్రధాన వనరు గండిపేట జలాశయంలో నిర్మాణ వ్యర్థాలు నింపుతున్నారు. ఆదివారం హిమాయత్‌నగర్ పరిధి ఎఫ్టీఎల్ పాయింట్ 425 వద్ద కుమ్మరి గోపాల్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో భవన నిర్మాణ వ్యర్థాలను జలాశయంలోకి వదిలారు. గుర్తించిన పెట్రోలింగ్ సిబ్బంది ట్రాక్టర్ యజమానిని అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విచారణలో అక్రమానికి పాల్పడ్డట్టు అంగీకరించడంతో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు. తాగునీటి వనరులను కలుషితం చేసే ఏ చర్యలనైనా సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమంగా వ్యర్థాలను పారబోస్తున్నట్లు గమనిస్తే జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కి సమాచారం ఇవ్వాలని కోరారు.