హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డోనేషన్ క్యాంపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పోలీసులు, ప్రజలు దానం చేసిన రక్తం నీలోఫర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్‌కు తీసుకెళ్తారని, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడకు వెళ్లొచ్చని సీపీ సూచించారు. బ్లడ్ డోనేషన్ క్యాంపుతో పాటు ఇలాంటి మెడికల్ క్యాంపులు మరిన్ని నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులను సీపీ అంజనీ కుమార్ కోరారు.
On (11th October 2021) Sri Anjani Kumar IPS CP, Hyd city inaugurated the blood donation camp set up by the Hyd city Traffic Police at Red Rose Garden, Nampally. and other officers have attended the program.https://t.co/AmRKadJvcK pic.twitter.com/kx6VQqPAng
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 11, 2021