Tarnaka Junction | ఉస్మానియా యూనివర్సిటీ: వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానున్న తార్నాక జంక్షన్ పనులను హైదరాబాద్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ బుధవారం పరిశీలించారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉండటంతో ఆయన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులను త్వరగా చేయించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్, నల్లకుంట ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, ట్రాఫిక్ విభాగం ఇంజనీరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ తదితరులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కమీషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు అనేక చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు.