హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అద్భుతమైన థీమ్ పార్క్ థ్రిల్ సిటీలో సమ్మర్ ఆఫర్ ప్రకటించారు. థ్రిల్ సిటీలో వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు.. ప్రవేశ రుసుములను సవరించారు. పిల్లలకు రూ. 699గా, పెద్దలకు రూ. 999గా నిర్ణయించారు. ఈ ఆఫర్ మార్చి 25 నుంచి జూన్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని థ్రిల్ సిటీ డైరెక్టర్లు రజనీకాంత్, అనిల్, బాలరాజు, అబ్రహంలు తెలిపారు.
ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో కూడిన థ్రిల్ సిటీ థీమ్ పార్కు రూపొందింది. పార్కులో ఏర్పాటు చేసిన రైడింగ్ మాన్ స్టార్ థియేటర్, స్ప్లాష్ కోస్టర్, ఫ్లైట్ సిమ్యులేటర్లు, స్కోడా కార్ డైవర్, ట్రైనింగ్ సిమ్యులేటర్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, బంపర్ కార్లు, ఫుట్సాల్, మ్యాజిక్ ట్రైన్, హార్స్ రంగులరాట్నం, ఇలా అనేకమైన గేమింగ్ జోన్, ఫుడ్ కోర్ట్ ఉన్నాయి.