Hyderabad Rains | హైదరాబాద్‌లు పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వాన పడుతున్నది. హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, చార్మినార్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.
అసిఫ్‌నగర్, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట, అల్వాల్, బోయిన్పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, లాలాపేట, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ బంజారాహిల్స్‌తో పాటు పలు చోట్ల వర్షం కురుస్తున్నది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనారులు ఇబ్బందులకు గురయ్యారు. పొద్దంతా నగరాన్ని మేఘాలు కమ్మివేశాయి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.