బావిలోకి దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
కొడుకులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో వృద్ధ దంపతులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కే)లో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు నర్సారెడ్డి (85), అంజమ్మ (82)లకు సిద్దారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
నారాయణఖేడ్, సెప్టెంబర్ 30: కొడుకులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో వృద్ధ దంపతులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కే)లో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు నర్సారెడ్డి (85), అంజమ్మ (82)లకు సిద్దారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
సిద్దారెడ్డి, సంగారెడ్డి స్థానికంగా, కిష్టారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. వృద్ధ దంపతుల పేర దాదాపు 30 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నది.భూమి పంపకాల్లో తేడాలు రావడంతో తల్లిదండ్రులు, కొడుకుల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వృద్ధ దంపతులు ఇద్దరే గ్రామంలో విడిగా మరో ఇంట్లో ఉంటున్నారు.
బుధవారం ఉదయం వారి వ్యవసాయభూమిలోని బావిలో వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. మనుమడు మారుతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

