బాక్సింగ్‌లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 70 కిలోల విభాగంలో ఆమె 3-2తో వరల్డ్ చాంపియన్ నటల్యా బొగ్డనొవ (కజకిస్థాన్)ను మట్టికరిపించింది. కానీ తొలిసారి ఆసియా గేమ్స్ ఆడుతున్న ప్రియా ఘంఘాస్, కపిల్ కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. విమెన్స్ 60 కేజీల సెమీస్‌లో ప్రియా 1-4తో యాంగ్ చెంగ్యు (చైనా) చేతిలో ఓడగా మెన్స్ 90 కేజీల విభాగంలో కపిల్ సైతం 1-4తో ఖబిబుల్లెవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమిపాలై కాంస్యాలతో తిరిగొచ్చారు.