Kalpika Ganesh | శేరిలింగంపల్లి, మే 31: హైదరాబాద్ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్‌లో గలాట చోటుచేసుకుంది. కేక్ విషయంలో సినీ నటి కల్పిక గణేశ్‌కు, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కల్పిక గణేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
శుక్రవారం రాత్రి బర్త్ డే జరుపుకునేందుకు కల్పిక గణేశ్ తన స్నేహితులతో కలిసి ప్రిజం పబ్‌కు వెళ్తే సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని కల్పిక గణేశ్ ఒక వీడియోను పోస్టు పెట్టింది. ఓ కేక్ విషయంలో తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డ్రగ్ ఎడిక్ట్ అంటూ దూషించారని పేర్కొంది. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదం జరిగిందని, అది ముదరడంతో పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది.
కాగా, ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ తెలిపారు. ఓ నటి గొడవ చేస్తుందని పబ్ నిర్వాహకులు డయల్ 100కు కాల్ చేయగా వెళ్లి నచ్చజెప్పి వెళ్లారని పేర్కొన్నారు.
ప్రిజం పబ్ వాడ హీరోయిన్ కల్పిక రచ్చ
నాకు సారీ చెప్పాలి అంటూ ప్రిజం పబ్ యాజమాన్యంతో గొడవకి దిగిన హీరోయిన్ కల్పిక
మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా అంటే
హీరోయిన్ కల్పికపై రెచ్చిపోయిన ప్రిజం పబ్ నిర్వాహకులు https://t.co/p2RTouER4L pic.twitter.com/ux9rGgqbBc— Telugu Scribe (@TeluguScribe) May 31, 2025