బంజారాహిల్స్, సెప్టెంబర్ 19: సమయపాలన పాటించని పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 59లోని అబ్సార్బ్ పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. రాత్రి 12 తర్వాత కూడా పబ్ తీసి ఉంది.
గుర్తించిన పోలీసులు పబ్ మేనేజర్ కమల్‌పై కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఈ పబ్ నిబంధనలు పాటించకపోవడంతో ఐదు కేసులు నమోదయ్యాయి.