ఖైరతాబాద్, మే 6 : నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ పోస్టాఫీసు నుంచి మార్కెట్ వరకు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న 400 మీటర్ల పొడువైన సీసీ రోడ్డు, గ్రంథాలయం చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు 350 మీటర్ల పొడువైన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్నరామ్మూర్తితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీవరేజీ, వీడీసీసీ రోడ్ల కోసం రూ.9 కోట్లు, సివరేజీ, తాగునీటి పైపులైను కోసం రూ.4 కోట్లు మంజూరు చేశామన్నారు.
సోమాజిగూడ డివిజన్లోని బీఎస్మక్తాలో రోడ్లు మంజూరయ్యాయని, సీవరేజీ లైన్లు పెండింగ్లో ఉన్నాయని, ముందుగా అవి పూర్తి చేసిన తర్వాతే రోడ్లు పూర్తి చేస్తామన్నారు. అకాల వర్షాలు వచ్చినప్పుడు లోలెవల్, బ్యాక్ వాటర్ వల్ల సమస్య ఉండేదని, మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సమస్యను తెలుసుకొని శాశ్వత పరిష్కారానికి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఎస్ఆర్డీపీ, నాలా డెవలప్మెంట్ తదితర పథకాల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ 17 డిప్యూటీ కమిషనర్ వంశీ, డీఈ చైతన్య, టీఆర్ఎస్ నాయకులు వైల ప్రవీణ్ కుమార్, మల్కు మహేందర్ బాబు, కిశోర్ కుమార్, కరాటే రమేశ్, శ్రీనివాస్ యాదవ్, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.
షెడ్డు పనులు ప్రారంభం
బంజారాహిల్స్: ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ కమ్యూనిటీహాల్లో రూ.30లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎంఎస్ స్ట్రక్చర్ షెడ్డు పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ పి.విజయారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..ఖైరతాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఎంసీ వంశీకృష్ణ, డీఈ చైతన్య,ఏఈ చరణ్ పాల్గొన్నారు.