సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు ఇక ముందు నిత్యం పచ్చదనంతో నిత్యం ప్రకాశించనుంది. ఓఆర్ఆర్ పొడవునా పచ్చదనం ఉండేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేపట్టిన డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటు పూర్తయ్యింది. గత ఏడాదిగా 158 కి.మీ పొడువునా ఉన్న ఓఆర్ఆర్ను 5 ప్యాకేజీలు, 62 బ్లాక్స్‌గా విభజించి, వే ర్వేరుగా పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.47 కోట్లు వెచ్చించింది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఓఆర్ఆర్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టం పనితీరును శుక్రవారం రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారని హెచ్ఎండీఏ అధికారు లు తెలిపారు.
అత్యాధునిక మౌలిక వసతులతో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఓఆర్ఆర్ ప్రధాన రహదారితో పాటు ఇరువైపులా ఉన్న సర్వీ సు రోడ్డు, ఖాళీ ప్రాంతాల్లో ఉన్న చెట్లకు నిరంతరం నీరు అందుతుంది. దీంతో చెట్లన్నీ ఏడాది పొడవునా పచ్చదనంతో ఉంటాయని అధికారులు తెలిపారు. ఓఆర్ఆర్ సెంట్రల్ మీడియంపై 3 వరసల్లో, ఇరువైపులా ఉండే సర్వీసు రోడ్ల పొడవునా 3 వరసల చొప్పున మొ త్తం 9 వరసల్లో డ్రిప్ సిస్టిమ్లో పైపులను ఏర్పాటు చేశా రు. మనుషుల ప్రమేయం లేకుండా ఓఆర్ఆర్ పొడవు నా ఉండే చెట్లకు, పూల మొక్కలను నీటిని సరఫరా చే సేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ సుమారు 63,13,503 చెట్లు ఉండగా, వాటన్నింటికి సమాన స్థాయిలో నీటి సరఫరా చేసే అవకాశం కలిగింది.
డ్రిప్ ఇరిగేషన్‌తో.. ఆరు కోట్ల మేర ఆదా…
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు గతంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసి, నిర్వహణ కోసం ప్రతియేటా రూ.20 కోట్ల వరకు ఖర్చు అయ్యే ది. కొత్తగా డ్రిప్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకురావడం ద్వారా ఏడాది రూ.6 కోట్ల మేర ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. గతంలో ప్రతి నెల ట్యాంకర్లతో మంచినీటి కోసం 4,304 ట్యాంకర్లను వాడుతుండగా, తాజా డ్రిప్ సిస్టంతో ప్రతినెల 3,572 ట్యాంకర్ల నీరు ఖర్చవుతుంది. దీంతో నెలకు 731 ట్యాంకర్ల వినియోగం తగ్గుతుంది. వీటన్నింటితో పా టు 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్ ఏడాది పొ డవునా పచ్చదనంతో కనిపించనుంది. దీంతో ఔటర్‌పై ప్రయాణం ఎంతో ఆస్వాదించేలా ఉంటుంది.
స్కాడా టెక్నాలజీ అమలు….
ఓఆర్ఆర్ చుట్టూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన స్కాడాకు అనుసంధా నం చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో ప్రతి రోజు చెట్లకు నీరందించడం, ఒక క్రమ పద్ధతిన కం ప్యూటర్ విధానంలో చేపడతారు. ఇందుకు సింగిల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌ను వాడతారు. దీని వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతాయి. ఏదైనా సమస్య తలెత్తితే సత్వరమే స్పందన, సమర్థవంతమైన నిర్వహణ, సమగ్ర నివేదికలను ఈ విధానంలో పొందేందుకు అవకాశం ఉంది.