వెంగళరావునగర్, డిసెంబర్ 12: క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం రహ్మత్ నగర్ డివిజన్లో హ్యాపీ క్రిస్మస్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ కానుకలను క్రైస్తవులకు ఆయన పంపిణీ చేశారు. క్రైస్తవ సోద ర,సోదరదీమణులు క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తమ ప్రభు త్వం కానుకలను అందజేస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం పాటు పడేది తమ ప్రభుత్వమేనని గతంలో ఏ పాలకులు కూడా క్రైస్తవులను పట్టించుకోలేదని అ న్నారు. అన్ని వర్గాల ప్రజలు పండుగలను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు దుస్తుల పంపిణీతో పాటు విందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో క్రైస్తవులకు ఎ లాంటి సమస్యలు లేకుండా చూసుకుంటానని అ న్నారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి,పాస్టర్ విద్యాసాగర్ పాల్,డివిజన్ అధ్యక్షులు మన్సూర్, ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు,శ్రీనివాస్, నాయకులు నాగరాజు, నర్సింహ, నందు నజీర్ పాల్గొన్నారు.
అన్ని మతాలకు సమ ప్రాధాన్యం…
ఎర్రగడ్డ, డిసెంబర్ 12: అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్న సీఎం కేసీఆర్‌ను మించిన సెక్యులర్ నేత మరెవ్వరూ లేరని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండలో రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ కానుకలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ సంక్షేమం తో పాటు అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, సరళ, దేవమణి, డేవిడ్, ఆనంద్‌కుమార్, మధురానగర్ మెథడిస్ట్ చర్చికి చెందిన అబ్రహం తదితరులు పాల్గొన్నారు.