మియాపూర్, డిసెంబర్ 11 : అనతికాలంలో దేశం గుర్తించేలా అమలవుతున్న సంక్షేమ పథకాలు త్వరలో ప్రజల మద్దతుతో జాతీయ స్థాయిలో ఇవి విస్తరించనున్నాయని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. గత పాలకులు విస్మరించిన దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన సంపత్‌కు దళితబంధు పథకం కింద మంజూరైన సెంట్రింగ్ సామగ్రిని విప్ ఆదివారం తన నివాసం వద్ద లబ్ధిదారుకు అందించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుకు గురైన దళితులను అందరితో సమానంగా ఎదిగేలా దళితబంధు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎంచుకున్న రంగాన్ని మరింతగా వృద్ధి పరుచుకునేందుకు పథకం ఆర్థిక సాయం వెన్నుదన్నుగా నిలుస్తున్నదని విప్ గాంధీ తెలిపారు. అర్హులైన దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకాన్ని మున్ముందు మరింతగా విస్తరించనున్నట్లు, నియోజకవర్గంలో 2 వేల మందికి అందించనున్నట్లు పేర్కొన్నారు. పథకం ఆర్థిక సాయాన్ని సమర్థంగా వినియోగించుకుని తోటి వారికి ఆదర్శంగా నిలవాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత రంగారావు, సంజీవరెడ్డి, భాస్కర్‌రావు, చంద్రకాంత్‌రావు, చంద్రమోహన్, మోజెస్, అష్రాఫ్, విద్యాసాగర్, రవికుమార్, శివ, ఖాజా పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్‌లో చర్చిని ప్రారంభించిన విప్..
మియాపూర్ డివిజన్ ప్రశాంత్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన షకీనా ఏజీ చర్చినీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి విప్ గాంధీ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, డేవిడ్‌రాజ్, శ్రీనివాస్, రాజా, ఎలియాజర్, ప్రసాద్, రంజిత్, నందు, గోపి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.