Chandrababu | హైదరాబాద్ అభివృద్ధి అయ్యిందంటే దానికి కారణం నేనే అని ఇప్పటికే పలుమార్లు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి అదే పాట అందుకున్నాడు. ఇప్పటివరకు హైటెక్ సిటీ గురించే గొప్పలు చెప్పిన బాబు.. ఈసారి పాతబస్తీ ముస్లింలను డెవలప్మెంట్ చేశానని చెప్పుకొచ్చాడు. పాతబస్తీకి దగ్గరలో ఎయిర్‌పోర్టు కట్టి, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి హైదరాబాద్ ముస్లింలను కోటీశ్వరులను చేశానని అన్నారు. అంతేకాదు హైదరాబాద్ బిర్యానీ.. ఫలక్‌నుమా ప్యాలెస్, పాతబస్తీ మార్కెట్ అన్నింటినీ తానే ప్రమోట్ చేశానని గొప్పలు చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో మాట్లాడిన చంద్రబాబు ఈ మేరకు చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌ను అన్నివిధాల అభివృద్ధి చేశానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్‌పోర్టు కట్టానని పేర్కొన్నారు. దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అలాగే ఓల్డ్ సిటీకి దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్డును కూడా నిర్మించానని అన్నారు. గతంలో తాను తీసుకున్న ఈ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌లో ఉన్న ముస్లింలంతా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా నేరుగా ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేసే విధంగా పెరల్స్‌ను తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేసిందని అన్నారు. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశామని తెలిపారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఒక చార్మ్ క్రియేట్ చేశామని అన్నారు. అలాగే నిజాం సంస్కృతిని కాపాడేందుకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో హోటల్ పెట్టి, దాన్ని పరిక్షించామని చెప్పారు. ఇలా ఒకటి రెండు కాదు.. వారసత్వం కాపాడటం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు.
ఆరోజు నేను చేసిన కృషి వల్లే ఈరోజు హైదరాబాద్ ముస్లింలు అందరూ కోటీశ్వరులు అయ్యారు
నాడు హైదరాబాద్ బిర్యానీని కూడా మేమే ప్రమోట్ చేశాం
ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు దక్కేలా చేశాం
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు pic.twitter.com/tUPOoP6W8H
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2025
ప్రపంచంలో ఎక్కడైనా తలసరి ఆదాయం వస్తుందంటే.. అక్కడ కీలక హోదాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే ఉంటున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. దానికి కారణం కూడా ఆనాడు తాను వేసిన ఫౌండేషన్ కారణమని పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టిన తర్వాత ఏపీలోని విశాఖకు పెట్టుబడులు వరుస పడుతున్నాయని తెలిపారు. వైజాగ్‌కు త్వరలో మరో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అన్నారు. 1.2 లక్షల కోట్ల పెట్టుబడులను గూగుల్ వైజాగ్‌లో పెట్టబోతుందని చెప్పారు. నా జర్నీ హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభమైంది.. ఇప్పుడు ఏపీలో గూగుల్‌తో ప్రారంభించి, ఏఐతో ముందుకువెళ్తున్నామని తెలిపారు.
నా మైనారిటీ సోదరులు ఎక్కడా వెనుకబడటానికి వీల్లేదని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ఎక్కువగా లబ్ధి పొందుతున్నది ముస్లిం మహిళలే అని.. దీనికి గర్వపడుతున్నానని అన్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని అందర్నీ చదివించి, గ్లోబల్ లీడర్‌గా తయారు చేసే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.