జల వనరులను జాగ్రత్తగా వాడుకుంటేనే మనుగడ

ఖైరతాబాద్, : జల వనరులను జాగ్రత్తగా వాడుకుంటేనే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ, జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం ది ఇని స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంట ర్, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వ ర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన దాన కిశోర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అందుబాటు లో ఉన్న నీటిని ఇష్టానుసారంగా వాడితే భవిష్యత్‌లో నీటి ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. దేశంలో అధిక జనాభా ఉండి, అందుకు సరిపడా నీటి వనరులు లేవన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్‌తో రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా ముందు చూపుతో వ్య వహరిస్తూ ‘మిషన్ కాకతీయ, కాళేశ్వరం, అర్బన్ మిషన్ భగీ రథ’ లాంటి బృహత్తర కార్య క్రమాలకు శ్రీకారం చుట్టార న్నారు. మంచినీటిని ఇంటిం టికీ అందించడంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా నిలిపారన్నారు. సింగపూర్, ఇజ్రాయెల్ వంటి నీటి వనరు లు తక్కువగా ఉన్న దేశాల్లో నీటిని చాలా పొదుపుగా వాడు తారని, అధికంగా నీటిని వృథా చేస్తే భవిష్యత్‌తో నీటి కష్టా లు తప్పవన్నారు. ఐఈఐ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఆపరేషన్స్-1) అజ్మీరా కృష్ణ, డైరెక్టర్ (రెవెన్యూ) వీఎల్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ పి.రవి కుమార్, డైరెక్టర్ (ఆపరేషన్-2) ఎం.స్వామి, టి.అంజయ్య, ప్రొ॥ రమణా నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

