Hyderabad Metro | హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు నవంబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రోజూ అన్ని టెర్మినళ్లలోనూ రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో రైలు ప్రారంభమవుతుంది. చివరి రైలు రాత్రి 11.45 గంటల వరకు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. శనివారం మాత్రం ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆదివారం అయితే ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి.