Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్! మెట్రో రైలు సేవలను రాత్రి 11:45 గంటల వరకు పొడిగించారు. మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త టైమింగ్స్ అమలు చేయనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ కొత్త సమయ వేళలు అమల్లో ఉంటాయి. మిగతా రోజుల్లో పాత టైమింగ్స్ కొనసాగుతాయి. ఇక టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. శని, ఆదివారాల్లో మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది.