NVS Reddy | సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్లలో ఏర్పాటు చేసిన ఫీడర్ సర్వీసుల ద్వారా ఇప్పటి వరకు 50 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మెట్రో షటిల్ సర్వీసులను నిర్వహిస్తున్న స్వీదా సంస్థ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ 15 మెట్రోస్టేషన్ల నుంచి 64 మార్గాల్లో స్వీదా సంస్థ ఫీడర్ సర్వీసులను నడుపుతున్నదని, ప్రతి రోజూ 16వేల మంది ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో సీఎండీ కేవీబీ రెడ్డి, స్వీదా మొబిలిటీ సీఈవో సిద్ధార్థ్ రవి, కో ఫౌండర్ జిగ్నేశ్ పి.బెలానీ, మెట్రో రైలు అధికారులు పాల్గొన్నారు.