హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచే నగర ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పందించి, ఈ నిర్ణయం తీసుకున్నారు.
అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు కొన్ని వీడియోలను, ఫోటోలను కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ.. ఉదయం 6 గంటల నుంచే మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు తరలివస్తున్నారు. కానీ రైళ్లు మాత్రం 7 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. రైళ్ల కోసం గంట పాటు వేచి చూడాల్సి వస్తుంది. గమ్యస్థానానికి త్వరగా చేరేవారికి ఇబ్బందిగా మారింది. ఒక వేళ క్యాబ్ బుక్ చేస్తే మార్నింగ్ అవర్స్‌లో రుసుం ఎక్కువ వసూలు చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 గంటల నుంచే రైళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని అభినవ్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
మీ ప్రతిపాదనకు తాను కట్టుబడి ఉన్నానని కేటీఆర్ రీట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కేటీఆర్ సూచించారు.
I agree with your suggestion Abhinav@md_hmrl and @ltmhyd please coordinate and ensure https://t.co/36OMtyaVxq
— KTR (@KTRTRS) November 8, 2021