సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గత మూడురోజులుగా కురుస్తున్న కుండపోత వానతో నగరం తడిసి ముైద్ధెంది. తాజాగా శుక్రవారం రాత్రి నగరంలోని పలు చోట్ల కురిసిన భారి వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్లోతు వర్షం నీరు చేరడంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో నగరంలో మళ్లీ ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు.
రాత్రి 10గంటల వరకు నాగోల్ బండ్లగూడలో అత్యధికంగా 9.33 సెం.మీలు, సరూర్‌నగర్‌లో , హయత్‌నగర్‌లో 6.13 సెం.మీలు, వనస్థలిపురంలో 6.0సెం.మీలు, సరూర్‌నగర్‌లోని మధురానగర్‌లో 4.38, రామంతాపూర్‌లో 3.28, మూసారాంబాగ్‌లో 3.03సెం.మీలు, హస్తినాపురంలో 2.95, అంబర్‌పేటలో 2.20సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎప్ అధికారులు వెల్లడించారు. ఆవర్తన ప్రభావంతో రాగల మరో 3రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.