రూ.150 కోట్ల విలువైన స్థలంపై మరోసారి కన్ను
జలమండలి రిజర్వాయర్ కోసం కేటాయించిన రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు స్థలం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న హోంగార్డును బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపైతోపాటు అతడి అనుచరులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది.
- హెచ్చరిక బోర్డు తొలగింపు
- జలమండలి స్థలం ఆక్రమణకు యత్నం
బంజారాహిల్స్, ఫిబ్రవరి 22: జలమండలి రిజర్వాయర్ కోసం కేటాయించిన రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు స్థలం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న హోంగార్డును బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపైతోపాటు అతడి అనుచరులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నెంబర్ 403 పి లోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని తట్టిఖానా జలమండలి కార్యాలయం పక్కన 1.20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జలమండలి రిజర్వాయర్ కోసం ప్రభుత్వం 1998లో కేటాయించి పంచనామా చేసి అప్పగించింది.
అప్పటినుంచి జలమండలి ఆధీనంలో ఉన్న సదరు స్థలంలోకి గత కొంతకాలంగా పరశరామ్ పార్థసారథి అనే వ్యక్తి బోగస్ పత్రాలతో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జలమండలికి కేటాయించిన స్థలం తనది అంటూ వాదిస్తున్నాడు. ఇటీవల ఈ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించిన పార్థసారథి వ్యవహారాన్ని నమస్తే తెలంగాణ వరుస కథనాలతో బట్టబయలు చేయడంతో రెవెన్యూ, జలమండలి అధికారులు రంగంలోకి దిగి స్థలంలో ఆక్రమణలను తొలగించారు.
జలమండలికి కేటాయించిన 1.20 ఎకరాల స్థలం చుట్టూ సరిహద్దు రాళ్లు పెట్టుకోవడంతో పాటు స్థలం కబ్జా కాకుండా జలమండలి విజిలెన్స్‌కు చెందిన సిబ్బందిని కాపలా పెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న పార్థసారథితో పాటు అతడి మనుషులు స్థలం వద్దకు వచ్చి అక్కడ జలమండలి ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించారు. స్థలం బయట జెండాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడున్న జలమండలి విజిలెన్స్ హోంగార్డు కే.రాఘవేందర్‌కు ఫోన్ చేసిన పార్థసారథి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురిచేశాడు.
ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణ చేసి ఖరీదైన జలమండలి స్థలం కబ్జాకు యత్నిస్తున్న పార్థసారథితో పాటు అతడికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రాత్రి జలమండలి తట్టిఖానా సెక్షన్ మేనేజర్ రాంబాబు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు పరశరామ్ పార్థసారథితో పాటు అతడి అనుచరులపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

