Madhura Nagar | వెంగళరావునగర్, మే 31 : నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిని విస్తరిస్తూ ఏప్రిల్ 24వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి పలు ప్రాంతాలు ఆదివారం నుంచి మధురానగర్ పీఎస్ పరిధిలో చేరనున్నాయి.
జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని యూసుఫ్‌గూడ బస్తీ, లక్ష్మీనరసింహనగర్, నవోదయ కాలనీ, కమలాపురి కాలనీ, శాలివాహన నగర్, గ్రీన్ బావర్చి, ప్రగతి నగర్, మారుతీనగర్, శ్రీకృష్ణదేవరాయనగర్, సవేరా ఫంక్షన్ హాలు, మహబూబ్ ఫంక్షన్ హాలు, కృష్ణానగర్ ఏ బ్లాక్, ఎస్బీహెచ్ కాలనీలు మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రానున్నాయి. ఈ ప్రాంత వాసులు ఆదివారం నుంచి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చని ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.