సుల్తాన్‌బజార్, మార్చి 11: దేశంలోనే హైదరాబాద్ సేఫ్ సిటీ అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నుమాయిష్‌లో శుక్రవారం ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌తో కలిసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ స్టాళ్లను ప్రారంభించారు. ట్రాఫిక్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సీపీ ఆనంద్ మాట్లాడుతూ నుమాయిష్ ప్రారంభమవుతుందంటే.. ఇంట్లో ఎంతో సందడి చేసేవాడినంటూ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రతలో ముందుందని, మహిళలపై వేధింపులు, క్రైం కేసులు తగ్గాయన్నారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ సందర్శకుల కోసం ఏటా నుమాయిష్‌లో ట్రాఫిక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాగా, సీపీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌తో కలిసి నుమాయిష్‌లో కలియతిరిగి.. సందడి చేశారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు,ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.