Hyderabad | హైదరాబాద్ ఓ విశ్వ నగరం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం సంతరించుకుంది. అలాంటి నగరంలో పారిశుధ్యం కొరవడి అపరిశుభ్ర వాతావరణం తాండవం చేస్తున్నది. పాలక, అధికార యంత్రాంగ విధి విధానాలకు నిదర్శనాలు ఇక్కడ కన్పిస్తున్న దృశ్యాలు. అసలే వర్షాకాలం, ఆపై ఎక్కడ చూసినా చెత్త, వ్యర్థాల సంచారం విచ్చల విడిగా చోటు చేసుకుంటున్నది. నగరం దుర్గంధభరితంగా తయారై వ్యాధులకు అలవాలమైంది. అయినా, పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపానపోరు. ఇక్కడ అగుపిస్తున్న ఈ దృశ్యాలు సోమవారం సికింద్రాబాద్ పరిధి జీరా, మేకల మండి ప్రాంతంలోనివి.
‘సాగర్’ను తిలకించేందుకు ప్రత్యేక బస్సులు
సుల్తాన్‌బజార్, ఆగస్టు 5: నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు తెరిచే సుందర దృశ్యాన్ని తిలకించేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీలత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సందర్శకుల సౌకర్యార్థం ఎంజీబీఎస్ నుంచి నాగార్జున సాగర్ వరకు నల్గొండ డిపో ఆధ్వర్యంలో ఉదయం 5, 6.45, 7.15, 7.30, 8, 9.45, 10.45, మధ్యాహ్నం 2.30, సాయత్రం 5, 5.40 నిమిషాలకు బస్సులను నడుపుతున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మామిడి హరికృష్ణకు పదోన్నతిపై హర్షం
హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ జాయింట్ రిజిస్ట్రార్ పదవి నుంచి అడిషనల్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. సహకార శాఖలో పదోన్నతి పొందినప్పటికీ సాంస్కృతిక శాఖ సంచాలకుడిగానే కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేరొన్నారు. తెలంగాణ కో ఆపరేటివ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసమూర్తి, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.