Hyderabad | ఈరోజుల్లో కామన్‌గా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య బట్టతల! ఒకప్పుడు వయసుపై బడిన తర్వాతే వెంట్రుకలు రాలిపోయేవి.. కానీ ఇప్పుడు 30 ఏండ్లు వచ్చేసరికే గుండు ప్లే గ్రౌండ్లా మారిపోతుంది. దీంతో చాలామంది రాలిపోతున్న తమ జుట్టును కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామని చెబితే ఇంకేమైనా ఉందా? ఎగబడిపోరూ!.. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ సెలూన్ ఓనర్ కూడా ఇలాంటి ప్రచారమే సోషల్‌మీడియాలో చేశాడు. ఇప్పటికే వెంట్రుకలు మొలిచాయని కూడా వీడియో చూపించాడు. ఇంకేముంది.. ఈ వీడియో చూడగానే బట్టతల సమస్యతో బాధపడుతున్న యువకులంతా పాతబస్తీకి ఎగబడిపోయారు. కానీ అక్కడే అసలు సమస్య ఎదురైంది.
అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్ పాతబస్తీ ఫతే దర్వాజ దగ్గరలో షకీల్ భాయ్ అనే వ్యక్తి బిగ్‌బాస్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. తన సెలూన్ పాపులారిటీ కోసం ఇటీవల సోషల్‌మీడియాలో ఒక ప్రచారం చేశాడు. తన దగ్గర ఉన్న కెమికల్‌తో బట్టతలపై కూడా వెంట్రుకలు మొలిపిస్తానని చెప్పాడు. ఇప్పటికే ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు జుట్టు మొలిపించానని ప్రచారం చేసుకున్నాడు. కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు. అవి కాస్త వైరల్ కావడంతో స్థానికంగా ఉన్న యువత.. బిగ్‌బాస్ సెలూన్‌కు పోటెత్తారు. వందలాది మంది యవకులు ఫతేదర్వాజలోని సెలూన్ దగ్గర క్యూకట్టారు.
తన సెలూన్‌కు వచ్చిన యువకులతో బయటే క్యూ కట్టించిన షకీల్ భాయ్.. వాళ్లందరికీ గుండు గీసి తన దగ్గర ఉన్న కెమికల్ రాసి పంపించాడు. ఆ కెమికల్ రాసిన తర్వాత గుండు అంతా మంట పుట్టడంతో పాటు వాచి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో లబోదిబోమంటూ యువకులు ఆస్పత్రిలో చేరారు.
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం
ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కి జుట్టు మొలిపించానంటూ ప్రచారం
పాతబస్తీ ఫతే దర్వాజా దగ్గర బిగ్‌బాస్ సెలూన్ ముందు క్యూ కట్టిన వందలాది మంది యువకులు
గుండు గీసి కెమికల్స్ రాసి పంపిన షకీల్ భాయ్.. సైడ్ ఎఫెక్ట్… pic.twitter.com/l2rKpDE1x1
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2025