ఉప్పల్జోన్ బృందం, మార్చి 9 : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేపట్టారు. నియామక ప్రకటనలను హర్షిస్తూ, స్వీట్లు పంచిపెడుతూ.. టాపాసులు కాల్చారు. నీళ్లు, నిధులతోపాటు నియామకాలు చేపడుతున్న మహనీయుడుగా కీర్తించారు. నిరుద్యోగ యువత కోసం సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనలను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి యువత మోసపోవద్దని సూచించారు.
డివిజన్, వెంకట్‌రెడ్డినగర్‌లో బీఎస్ఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతి సుమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గరిక సుధాకర్, డా.బీవీ చారి, కంచర్ల సోమిరెడ్డి, మస్తాక్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో నాచారం వైజయంతి టాకీస్ ప్రాంతంలో ఉద్యోగ ప్రకటనపై హర్షిస్తూ టపాసులు కాల్చారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, కాటేపల్లి రవీందర్‌రెడ్డి, విఠల్‌యాదవ్, సువర్ణ సుగుణాకర్‌రావు, చంద్రశేఖర్, రాజశేఖర్, రాంచందర్, దేవులపల్లి యాదగిరి, కట్ట బుచ్చన్నగౌడ్, శ్రీరామ్ సత్యనారాయణ, భాను పాల్గొన్నారు.
కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిలుకానగర్ వార్డు కార్యాలయం ప్రాంతంలో సంబురాలు నిర్వహించారు. ఈమేరకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు బన్నాల ప్రవీణ్, కొండల్‌రెడ్డి, రాంరెడ్డి, జగన్, నరసింహరావు, శ్రీనివాస్, మాస శేఖర్, రామానుజన్, శ్రీనివాస్ యాదవ్, అల్లిబిల్లి మహేందర్, బింగి శ్రీను పాల్గొన్నారు.
డివిజన్, రాధిక చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఎస్‌రావునగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపా ల్‌రెడ్డి, మాజీ కార్పొ రేటర్ కొత్త రామారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, నాయకులు కందాడి సుదర్శన్‌రెడ్డి, శేర్ మణెమ్మ, బేతాల బాల్‌రాజు పాల్గొన్నారు.
డివిజన్లో స్థానిక ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపు కున్నారు. కార్యక్రమంలో పన్నాల దేవేందర్‌రెడ్డి , విజయ్, తండా వాసుదేవ్‌గౌడ్, సానల రవి, చంద్రశేఖర్, మురళి, భాసిత్ఖాన్, బాబు, దుర్గయ్య, సాయి, నాగరాజ్ పాల్గొన్నారు.
హెచ్‌బీకాలనీ డివిజన్లో నిరుద్యోగులు.. కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదా స్తో కలిసి స్వీట్లు తినిపించుకుంటూ సంబురా లు జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడి, మహిళా నాయకురాలు భాగ్యమ్మ, ఫర్వీన్, పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడం హర్షణీయం. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాకు ఉద్యోగ ప్రకటనతో సంతోషంగా ఉంది. అలాగే నియామకాల్లో గరిష్ట వయో పరిమితి పెంచడం దేశ చరిత్రలో మరిచిలేని నిర్ణయం. నిరుద్యోగులందరూ ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు.
సీఎం.. మా దేవుడు
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకు సాగి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన సీఎం కేసీఆర్.. నేడు వేలాది ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి దేవుడయ్యాడు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ చేపట్టని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం మరిచిపోలేనిది.