ఉప్పల్/కాప్రా, ఏప్రిల్ 23 : ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శనివారం నాచారం డివిజన్లోని బాబాప్యాలెస్లో, ఉప్పల్‌లోని ఎస్ఆర్ ఫంక్షన్హాల్లో, కాప్రా డివిజన్ వలువర్నగర్లో పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లీనరీ సందర్భంగా కాలనీలు, బస్తీలు, చౌరస్తాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు బైక్‌ర్యాలీలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టాల న్నారు. పార్టీలో క్రమశిక్షణతో ఉండాలని, ఎవరైనా ఇబ్బంది కలిగిం చేవిధంగా కార్యక్రమాలు చేపడితే సహించేదిలేదన్నారు. కార్యకర్తలు, నేతలు ఐకమత్యంగా పనిచేయాలన్నారు.
ఆయా సమావేశాల్లో ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్లు శాంతిసాయిజెన్ శేఖర్, స్వర్ణరాజు, నాయకులు మేకల ముత్యంరెడ్డి, వేముల సంతోష్‌రెడ్డి, సాయిజెన్ శేఖర్, కొరపాక అంజి, గడ్డం రవికుమార్, రవీందర్‌రెడ్డి, పోగుల వెంకటరమణారెడ్డి, ఎర్రం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరామ్ సత్యనారాయణ, కట్ట బుచ్చన్న, రాజబాబు, విఠల్‌యాదవ్, మధుసూదన్‌రెడ్డి, దేవులపల్లి యాదగిరి, నవీన్‌రెడ్డి, సుగుణాకర్‌రావు, ప్రీతిరెడ్డి, సుగుణ, షాహిన్‌బేగం, నిర్మల, మస్క సుధాకర్, మేకల మధుసూదన్‌రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, గడ్డం రవి, లేతాకుల రఘుపతిరెడ్డి, అర్జున్‌రెడ్డి, టంటం వీరేశ్, జహంగీర్, అనితా రెడ్డి, రాణిరెడ్డి, హేమలత, జీనత్ బేగం, సుడుగు మహేందర్‌రెడ్డి ఎంకే బద్రుద్దీన్, గిల్బర్ట్, బైరి భాస్కర్‌గౌడ్, కొప్పుల కుమార్, కొండల్ గౌడ్, పవన్, ఎండీ అలీ, భిక్షపతి, రవీందర్రావు, సతీశ్‌రెడ్డి, మచ్చపాండు, శ్రీనివాస్, శివకుమార్, సుశీల్, కిట్టు, గిరుకబాయి సురేఖ, శ్రీదేవి పాల్గొన్నారు.