బడంగ్‌పేట,ఏప్రిల్23: తెలంగాణ అభివృద్ధికి ఆటం కంగా మారుతున్న బీజేపీ పార్టీని నామ రూపాలు లేకుం డా చేయాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. శనివారం బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈనెల 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడకలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహక సమావేశం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అధ్యక్షతలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తుంటే ఓర్వలేక బీజేపీ పార్టీ ఇబ్బందులు పెడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాల చూస్తుందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ పన్నాగాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో దళితం బంధు ఎందుకు ప్రవేశ పట్టలేదో చెప్పాలన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను వాడవాడల ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ఎండగడుతూ ప్రజలకు వాస్తవాలను తెలిజెప్పాలన్సిన బాధత్య కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి డివిజన్లో 10 నుంచి 15 జెండాలను ఎగుర వేయాలన్నారు. డివిజన్లలో బైక్ ర్యాలీలు తీయాలన్నారు. బంగారు తెలంగాణ సాధనే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను చూస్తే అభివృద్ధి తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, మేయర్లు పారిజాత నర్సింహారెడ్డి, దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్విక్రంరెడ్డి నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాలకిషన్,ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు నగేశ్, సరూర్‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్‌అధ్యక్షుడు మహేందర్ యాదవ్, తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్, జల్పల్లి మున్సిపల్ అధ్యక్షులు ఖలీఫా, మీర్‌పేట వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేశ్ గౌడ్, శేఖర్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
మే 10లోపు జిల్లా గ్రంథాలయం అందుబాటులోకి..
మే 10లోపు జిల్లా గ్రంథాలయాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ భవనాన్ని కేంద్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాండురంగారెడ్డి, మేయర్ పారిజాత నర్సింహారెడ్డి,స్థానిక కార్పొరేటర్ సూర్ణ గంటి అర్జున్‌తో కలిసి శనివారం పరిశీలించారు.గ్రంథాలయంలోని గదులతో పాటు పక్కనే ఉన్న స్టేడియాన్ని మంత్రి పరిశీలించి క్రీడాకారులతో కాసేపు ముచ్చటించా రు. క్రీడాకారుల కోసం తాగునీటి సౌకర్యకం కల్పించాలని మేయర్, డీఈఈని ఆదేశించారు. సుమారు రూ. 5 కోట్లతో గ్రంథాలయాన్ని నిర్మించా మన్నారు.సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన అనంతరం గ్రూప్-1,2,3,ఉపాధ్యాయ, పోలీస్ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధ్దమవుతు న్న వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయ త్నం చేస్తున్నామన్నారు. గ్రంథాలయంలో పుస్తకాల కొనుగోలు కోసం రూ.10 లక్షలు కేటాయించామన్నారు. అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. కార్యక్రమంలో డీఈఈ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.