కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23 : అనేక పోరాటాలు..మరెన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ట్ర స్ఫూర్తితో రాబోయే రోజుల్లో గులాబీ జెండాను ఎగురవేసి..ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్లీనరీ సమావేశాల సన్నాహక సభలో భాగంగా శనివారం రాత్రి చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణుల సభలో వారు మాట్లాడా రు. కుత్బుల్లాపూర్ గులాబీ జెండాకు అడ్డా అని రుజువు చేసేందుకు ఈ నెల 21న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి వాడవాడనా, గల్లీగల్లీనా గులాబీ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉం టుందని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. ఎవరెన్నీ కుట్రలు పన్నినా టీఆర్ఎస్ గొడుగు కింద..ఒక్క కుటుంబంలా కలిసిమెలిసి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఎం గౌరీశ్, రంగారెడ్డి నగర్ కార్పొరేటర్ విజయ్‌శేఖర్‌గౌడ్, సుభాష్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, పార్టీ శ్రేణులు సం పత్మాధవరెడ్డి, సూర్యప్రభ, సత్తిరెడ్డి, దూదిమెట్ల సోమేశ్యాదవ్, జ్ఞానేశ్వర్, కుత్బుల్లాపూర్, రంగారెడ్డినగర్, జీడిమెట్ల డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దుండిగల్, ఏప్రిల్ 23 : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఈ నెల 27న నిర్వహించనున్న ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో శనివారం గండిమైసమ్మలోని జిల్లా పార్టీ కార్యాలయంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు మా ట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గు ర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని, పార్టీ జెండాల ఆవిష్కరణ, బైక్ ర్యాలీలు చేపట్టాల ని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రవియాదవ్, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ సుంకరి క్రిష్ణవేణికృష్ణ, వైస్ చైర్మన్ పద్మారావు, పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, కౌన్సిలర్ శంభీపూర్కృష్ణతోపాటు పలువురు కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
గాజులరామారం సర్కిల్ పరిధిలోని కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలతో సూరారం డివిజన్, షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కె.జగన్, రషీదాబేగం, మాజీ జడ్పీవైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, నేతలు కస్తూరి బాలరాజు, విజయ్రామిరెడ్డి, పుప్పాల భాస్కర్, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్‌రెడ్డి, మహ మ్మద్ఫ్రీ, కొలుకుల జైహింద్, అమీర్‌ఖాన్, హుస్సేన్, నర్సారెడ్డితో పాటు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు కార్యకర్తల సమావేశం శుక్రవారం రాత్రి కొలన్ రాఘవరెడ్డి గార్డెన్లో జరిగింది. మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ముఖ్యఅతిథులుగా హాజరై పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజు, ఎన్ఎంసీ టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ ఆగంపాండుముదిరాజు, నగరపాలకసంస్థ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయప్రసాద్, నాయకులు కొలన్గోపాల్రెడ్డితో పాటు ఎన్ఎంసీ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, కమిటీ సభ్యులు, మహిళా నేతలు పాల్గొన్నారు.