మాదాపూర్, ఏప్రిల్ 23: టీఆర్ఎస్ పార్టీ చేసిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటి వరకు పార్టీ సాధించిన విజయాలకు సూచికగా మాదాపూర్ న్యూ హఫీజ్‌పేట్‌లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హఫీజ్‌పేట్ కార్పొరేటర్ పూజితాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్లతో పాటు స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ …రాష్ట్రం సాధించిన విజయాలతో దేశం అంతా నేడు తెలంగాణ వైపే చూస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
మియాపూర్ , ఏప్రిల్ 23 : కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పండుగలా నిర్వహించుకోవాలన్నారు. ఓ హోటల్లో నిర్వహించిన మియాపూర్ డివిజన్ పార్టీ సర్వసభ్య సమావేశానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు పురుషోత్తం యాదవ్, లావణ్య, ఖాజా, శ్రీనివాస్‌గౌడ్, బాబులను ఘనంగా సత్కరించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో శ్రేణులు గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు.