పీర్జాదిగూడ, ఏప్రిల్ 22: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రూ.3 కోట్ల నిధులతో 3వ డివిజన్ సాయిఐశ్వర్య కాలనీలో 2ఎంఎల్(20లక్షల లీటర్ల) ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు, 16, 26వ డివిజన్లలో తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులకు మేయర్ , కార్పొరేటర్లు శారద ఈశ్వర్రెడ్డి, రమ్య సతీశ్గౌడ్, రాజేశ్వరి అంజిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరవాసులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, నాయకులు చంద్రారెడ్డి, హెచ్ఎండీఎస్ మేనేజర్ రమ్యప్రియ, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు వినికిడి పరికరాలు పంపిణీ
దివ్యాంగులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని మేయర్ వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం పీర్జాదిగూడలోని కుర్ర ఎల్లయ్య కన్వెన్షన్లో అభిశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మేయర్ హాజరై వికలాంగులకు కుట్టుమిషన్లు, వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, ఫౌండేషన్ సభ్యులు, వికలాంగులు పాల్గొన్నారు.