సికింద్రాబాద్/మారేడ్‌పల్లి, ఏప్రిల్ 22 : టూవీలర్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ట్రాక్ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో హెల్మెట్ల పంపిణీ కంటోన్మెంట్ వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో శుక్రవారం న్యూ బోయిన్‌పల్లిలోని ఫైజాన్ పాఠశాలలో ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్సూరెన్స్ సమకూర్చిన హెల్మెట్లను ట్రాక్స్ ఎన్జీ వో సంస్థ ద్వారా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన హెల్మెట్లను విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు శ్యామ్‌కుమార్, నళినీకిరణ్, ప్రభాకర్‌తో పాటు రహమాన్, ఖాదిర్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాల నివారణ..
మారేడ్పలి : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చునని టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం కంటోన్మెంట్ ఐదవ వార్డు కృష్ణానగర్‌లోని గాంధియన్ పాఠశాల, కాకాగూడలోని గవర్నమెంట్ పాఠశాలలో ఐసీఐసీఐ లాంబార్డ్, ఎమ్మెల్లార్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ…ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్క రూ హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు సభ్యులు పాండుయాదవ్, ప్రభాకర్, శ్యామ్ కుమార్, నళిని కిరణ్, ఆది శంకర్, రాజేశ్, ఉదయ్, రంజన్ గౌడ్ టీఆర్ఎస్ నాయకులు పెద్దాల నర్సింహ, ప్రవీణ్‌యాదవ్, రాజాసింగ్, శ్రీకాంత్, శివ, రిచర్డ్, రాజ్, యాదగిరి, కాసీం, ప్రవీణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.