హిమాయత్‌నగర్, ఏప్రిల్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం అన్ని రకాల వైద్య సేవలు పేదలకు అందేలా కృషి చేస్తున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి శాఖ ల మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ పాఠశాలలో ఆరోగ్యమేళా కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హిమాయత్‌నగర్ డివిజన్ కార్పొ రేటర్ జి. మహాలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్‌వో నిర్మలాప్రభావతితో కలిసి వారు ఈ మేళాను ప్రారంభించారు. ఈ మేళా లో ఏర్పాటు చేసిన 24 రకాల వైద్య క్యాంప్‌లను పరిశీలించి సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికీ రూ.5లక్షల ఆరోగ్య బీమాతో కూడిన సౌలభ్యాన్ని కేంద్రం అంద జేస్తుందని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కార్డులో ప్రొఫైల్ పొందుపరిచి, ధనిక, పేద అనే తేడా లేకుం డా అందరికీ హెల్త్ కార్డులు అందజేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుటుందని తెలిపారు. దేశంలోని ఏ దవాఖానలోనైనా ఈ కార్డు నంబర్ చెప్పి వైద్యం చేయించుకునే అవకాశం ఉందన్నారు. ఐదేం డ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆరోగ్యమేళాలో 3,020 మందికి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి, సుతారి, నాయకులు సర్ఫరాజ్, అశోక్, యతిరాజ్, బీజేపీ నగర అధ్యక్షుడు గౌతమ్‌రావు, నాయకులు జి. రామన్‌గౌడ్, జైస్వాల్, ఎస్పీహెచ్వో డాక్టర్ పద్మజ, వైద్యాధికారులు డాక్టర్ దీప్తిప్రియాంక, శ్రీకళ, డాక్టర్ రాజలక్ష్మి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.