మాదాపూర్, ఏప్రిల్ 22: అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పదని, సామాజిక బాధ్యతగా ప్రతి ఒకరు రక్తదానం చేయాలని చేవెళ్ల ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్‌లో 360 లైఫ్ నిర్మాణ రంగ సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ, అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, మెగా హెల్త్ క్యాంపుకు ఐఆర్సీఎస్ చైర్మన్ అజయ్ మిశ్రా, ఎమ్మెల్యే, విప్ గాంధీ, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు రాంచందర్, సత్యారెడ్డి, సాయి, లోకేశ్, బ్రహ్మయ్య, మహేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గోకుల్ ప్లాట్స్‌లో ఉచిత వైద్య శిబిరం
మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్‌లోని బెరాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి సౌజన్యంతో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు వి. జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస్ హాజరై శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. బెరాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఏసుపాదం, లక్ష్మణ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సాంబశివరావు, బ్రిక్ శ్రీను, గుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.