కవాడిగూడ, ఏప్రిల్ 22: రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం భోలక్‌పూర్ డివిజన్లోని పద్మశాలీ కాలనీలో రూ. 70 లక్షల వ్యయంతో 500 మీటర్ల వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులను కార్పొరేటర్ గౌసొద్దీన్, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ ఏఈ తిరుపతిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. పద్మశాలీ కాలనీలో రూ. 70 లక్షల నిధులతో వీడీసీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన నాయకుడు ముఠా జయసింహ, బింగి నవీన్‌కుమార్, భోలక్‌పూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, షరీపోద్దీన్, ఉప్పలయ్య, ముచ్చకుర్తి ప్రభాకర్, మహ్మద్ అలీ, రహీం, వాహెబ్, ఎ. శంకర్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు గుండా ఉమాకాంత్ ముదిరాజ్, జ్యోతి, పబ్బా కృష్ణ, రవీందర్, ఆర్. శ్రీనివాస్, ప్రవీణ్ కల్యాణ్, మల్లేశ్, భరత్, నందు, మహేశ్, అశోక్, రాజ్‌కుమార్, సునిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకలను పండుగలా జరుపుకోవాలి
ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పండుగలా జరుపుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్‌పూర్ డివిజన్లోని పద్మశాలీ కాలనీలోని పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గుండా ఉమాకాంత్ ముదిరాజ్ నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు, నాయకులనుద్దేశించి ఆయన మాట్లాడారు. డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి పోటీలేదని పేర్కొన్నారు. 27న జరిగే పార్టీ ఆవిర్భావాన్ని వాడవాడలా గులాబీ జెండాలను ఎగురవేసి పండుగ వాతావరణాన్ని తలపించేలా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలోనందు, కళ్యాణ్, ముచ్చకుర్తి ప్రభాకర్, గోవింద్, భీమ్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పటిష్టతకు సమష్టిగా పనిచేయాలి
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పటిష్టతకు కార్యకర్తలు పాటుపడాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం డివిజన్ అధ్యక్షుడు ఆర్ మోజస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్, ఇంద్రసేనారెడ్డి, కిషన్‌రావు, నీలాదేవి, రాజు చారి, జ్ఞానేశ్వర్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.