మాదాపూర్, ఏప్రిల్ 1: భవన నిర్మాణ రంగంలో ఫైర్ సేఫ్టీ కీలక భూమిక పోశిస్తుందని, ఫైర్ సేఫ్టీపై ప్రతి ఒకరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధి అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సంధ్య ఫైర్ ఇంజనీర్స్ కార్పొరేట్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా అరెకపూడి గాంధి విచ్చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, స్థానిక నాయకులతో కలిసి నూతన కార్యాలయానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒకరికి ఫైర్ సేఫ్టీపై అవగాహన ఉన్నప్పుడే ఆకస్మికంగా సంభవించే విపత్తులను నివారించేందుకు అవకాశం ఉం టుందని తెలిపారు. వచ్చే ఆపదలను, ప్రమాదాలను ముందస్తుగా నివారించొచ్చని అన్నారు. అనంతరం, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, నా ణ్యమైన ఫైర్ సేఫ్టీ పరికరాలను అమర్చుకోవడంలో ఉదాసీన వైఖరి తగదని ప్రజలకు సూచించారు. ఇందులో భాగంగా సంస్థ నిర్వాహకులు కృష్ణ మోహన్ రావు, గాంధీలకు సన్మానం చేశా రు. ఈ కార్యక్రమంలో సంధ్య ఫైర్ సేఫ్టీ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యన్న, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాద వ్, జనరల్ సెక్రటరీ సాంబశివరావు, టీఆర్ఎస్ నాయకులు సంజీవరెడ్డి, గుమ్మడి శ్రీనివాస్, రాంచెందర్, గౌస్ పాల్గొన్నారు.