సుల్తాన్‌బజార్,ఏప్రిల్ 1: ప్రత్యక్షంగా నిర్వహించే శస్త్ర చికిత్సలు వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతాయని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు. కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో ఏఓఐ హైదరాబాద్ శాఖ, ఈఎన్టీ దవాఖానల సంయుక్తాధ్వర్యంలో డాక్టర్ ఎంబీఎన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈఎన్టీ లైవ్ సర్జికల్ వర్క్‌షాప్-2022ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక దశలో చెవి, ముక్కు, గొంతులో వచ్చే వ్యాధులకు శస్త్ర చికిత్స చేసే విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా వివరించడంతో విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓఐ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ శోభన్‌బాబు, ప్రధాన కార్యదర్శి మహ్మద్ హమీద్, కోశాధికారి మహేశ్వర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మౌనికా రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగరాజు, డాక్టర్ ఎల్.సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్, డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ కరుణ, డాక్టర్ ఆనంద ఆచార్య, డాక్టర్ బెంజిమెన్, డాక్టర్ మహేశ్‌గుప్తా, డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు యువ వైద్య విద్యార్థులు, దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.