ఘట్కేసర్ రూరల్, మార్చి 22: అభివృద్ధిలో అగ్రగామిగా నిలవడంతో పాటు ఆదర్శవంతమైన పాలనతో తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షించిందని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. చౌదరిగూడ పంచాయతీ పరిధిలో జలమండలి రూ.12 కోట్ల నిధులతో నిర్మించనున్న 20 లక్షల లీటర్ల మంచినీటి సామర్థ్యం గల రిజర్వాయర్, 25 కిలో మీటర్ల పైపులైను నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరంతర విద్యుత్‌తోపాటు ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి హెల్త్‌సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, స్థానిక సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్, సర్పంచులు వెంకటేశ్ గౌడ్, వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు రాములు గౌడ్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.