దుండిగల్, మార్చి 22 : దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో ‘హజిల్ మానియా’ పేరుతో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన నమూనాలు, వివిధ రకాల ఫుడ్స్టాల్లను కళాశాల కార్యదర్శి, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కళాశాల కోశాధికారి మర్రి మమతారెడ్డి పరిశీలించి, అభినందించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మర్రి శ్రేయారెడ్డి, హెడ్-సీఈవో డా.మహేంద్ర, కో-ఆర్డినేటర్ దుర్గాప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.