పహాడీషరీఫ్, మార్చి 20: పహాడీ షరీఫ్ బాబా షర్ఫుద్దీన్ దర్గా పైకి త్వరలో భక్తులకు ర్యాంపు అందుబాటులోకి వస్తున్నదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. దర్గా ఉర్సు ఉత్సవా ల్లో భాగంగా మహమూద్ అలీ దర్గాకు విచ్చేశారు. దర్గాకు చాదర్, పూలు సమర్పించారు. అనంతరం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం, రూ.16 కోట్లతో నిర్మాణం అవుతున్న ర్యాంపు పనులను ఆయ న పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీల సం క్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజ లు సుఖ సంతోషాలతో జీవించే విధంగా దీవించాలని బాబా షర్పుద్దీన్ను కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, పహాడీ షరీఫ్, బాలపూర్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, భాస్కర్, దర్గా కమిటీ అధ్యక్షుడు ఫరీదుద్దీన్, మొయినోద్దీన్, జహంగీర్ పాల్గొన్నారు.