శామీర్‌పేట, మార్చి 20 : శామీర్‌పేట మండలం అలియాబాద్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన సీఎంఆర్ కన్వెన్షన్‌ను ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, మేకల కావ్య, మున్సిపల్ చైర్మన్లు రాజేశ్వర్‌రావు, పావనీ యాదవ్, దీపికానర్సింహారెడ్డి, లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్పర్సన్ వాణీవీరారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎండీ జహంగీర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, డాక్టర్ భద్రారెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నందారెడ్డి, కంటం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, దర్గా దయాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్, మల్లేశ్‌గౌడ్, నోముల శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.