సిటీబ్యూరో, మార్చి 19(నమస్తే తెలంగాణ): వాహనాలకు నలుపు రంగు ఫిలింలు వేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే.. కేసు నమోదు చేయడంతో పాటు రూ.1000 జరిమానాను విధిస్తామని స్పష్టం చేస్తున్నారు. కేవలం జెడ్ , జెడ్ ప్లస్ భద్రత ఉన్నవారికి మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. కాగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం నుంచి వాహనాల నంబరు ప్లేట్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నంబర్ ప్లేట్లు, ధ్రువీకరణపత్రాలు సరిగా లేకున్నా.. ఆ వాహనాలను సీజ్ చేయనున్నారు. కొందరు నంబర్లను తొలగించడం.. అక్షరాలు తప్పుగా రాయడం.. మాస్కులు, రంగులు వేయడం.. ప్రెస్, ఎమ్మెల్యే, పోలీస్ స్టిక్కర్లు వంటివి అంటించడం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.