సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తేతెలంగాణ) : పార్కులు, ఫారెస్ట్ బ్లాక్‌లు, ఉట్టిపడే పచ్చదనంతో భాగ్యనగరం పరిఢవిల్లుతోంది. భారత్‌లో నిజమైన గ్రీన్‌సిటీ హైదరాబాద్. అర్బన్ ఫారెస్ట్ (పట్టణ అడవులు)లు నగరవాసులకు మెరుగైన జీవితాన్నిస్తున్నాయి. ఇలాంటి నగరాన్ని ప్రపంచ అటవీ నగరంగా ప్రకటించాలి.. అని ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సొల్హెమ్ తన ట్విట్టర్లో నగర గ్రీనరీకి సంబంధించి పై ఫొటోతోపాటు పలు చిత్రాలు షేర్ చేశారు. వీటిని చూసిన మంత్రి కేటీఆర్ థాంక్యూ ఎరిక్ అని రీట్వీట్ చేశారు.