సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 18(నమస్తే తెలంగాణ): శరవేగంగా ఐటీ కారిడార్ విస్తరణ, ఊహించని రీతిలో దూసుకుపోతున్న నగరాభివృద్ధి, వెరసి అవుటర్ రింగు రోడ్డు మాత్రమే కాదు.. దానికి రెండువైపులా సర్వీసు రోడ్లు కూడా ట్రాఫిక్ అవసరాలకు సరిపోయేలా కనిపించవడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుచూపుతో అవుటర్ సర్వీసు రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా గచ్చిబౌలి కేంద్రంగా ఐటీ కారిడార్ అటు శంషాబాద్, ఇటు నార్సింగి, మరోవైపు కొల్లూరు వరకు… ఇలా విస్తరిస్తున్న కొద్దీ రహదారుల వ్యవస్థను సైతం అదే రీతిలో పటిష్టం చేస్తున్నది. రూ.300 కోట్లతో హెచ్ఎండీఏ ఈ ప్రాంతాల పరిధిలోని అవుటర్ సర్వీసు రోడ్లను విస్తరించడంతో పాటు కీలకమైన గచ్చిబౌలి – శంషాబాద్ అవుటర్ రోడ్డుకు సైతం పునరుద్ధరణ పనుల్ని చేపట్టింది.
ఒకప్పుడు ఐటీ అంటే హైటెక్ సిటీ, మాదాపూర్ వరకు మాత్రమే. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత వస్తున్న జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు… ఐటీ, ఐటీఈఎస్ కేంద్రాల ఏర్పాటుతో ఐటీ కారిడార్‌కు ఎల్లలు లేకుండా పోయాయి. గచ్చిబౌలి కేంద్రంగా శరవేగంగా విస్తరిస్తున్న కారిడార్‌తో 158 కిలోమీటర్ల అవుటర్ రింగు రోడ్డు పరిధిలో ఎక్కడాలేని విధంగా ఈ స్ట్రెచ్‌లోనే వాహనాల రాకపోకలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా అవుటర్ రింగు రోడ్డుపై నిత్యం సుమారు 1.20 లక్షల వాహనాలు తిరిగితే… అందులో 70 శాతం మేర 25 కిలోమీటర్ల గచ్చిబౌలి – శంషాబాద్ స్ట్రెచ్‌లోనే తిరుగుతుండటం విశేషం. అయితే కేవలం అవుటర్ పైనే కాదు… దానికి రెండువైపులా ఉన్న సర్వీసు రోడ్లపైనా ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న సర్వీసు రోడ్లు తాజా ట్రాఫిక్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో వీటిని నాలుగు లేన్లుగా మార్చేందుకు హెచ్ఎండీఏ పనులు ముమ్మరంగా చేపడుతున్నది.
చేపడుతున్న పనులు ఇవే…