సిటీబ్యూరో,మార్చి 15 (నమస్తేతెలంగాణ)/ఎల్బీనగర్ : స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో అండర్‌పాస్ (కుడివైపు), రూ. 28.642 కోట్లతో బైరామల్‌గూడ ఫ్లైఓవర్ నిర్మాణాలు పూర్తయ్యాయి. బుధవారం వీటిని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ రెండింటి రాకతో ఎల్బీనగర్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా తొలగనుంది.