మెహిదీపట్నం, మార్చి 15 : ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ కృషి చేస్తున్నదని నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం విజయ్‌నగర్ కాలనీ డివిజన్లో నెలకొన్న సమస్యలను పార్టీ కార్యాలయంలో డివిజన్ నాయకులు ఆనంద్‌కుమార్‌గౌడ్‌కు విన్నవించారు.అనంతరం నీటి సమస్యలను పరిష్కరించాలంటూ జలమండలి మేనేజర్ రాంబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. కార్యక్రమంలో అభిషేక్ రాజ్, యూసుఫ్, ఇక్బాల్, సర్వర్, సలీం, జనార్దన్, లతీఫ్, శ్రీకాంత్, యాదగిరి పాల్గొన్నారు.
హకీంపేట్ కుంటలో.. థీమ్‌పార్కు నిర్మాణ పనులు
ప్రజలకు వేసవిలో ఆహ్లాదాన్ని పంచడానికి డివిజన్లలో ఉన్న పార్కులను జీహెచ్ఎంసీ అధికారులు, హార్టికల్చర్ విభాగం అధికారులు థీమ్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. కార్వాన్ నియోజకవర్గం నానల్‌నగర్ డివిజన్ హకీంపేట్ కుంట పార్కును థీమ్ పార్కుగా అభివృద్ధి చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం నానల్‌నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, హార్టికల్చర్ మేనేజర్ భూమాతో కలిసి పనులను పరిశీలించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ మార్గదర్శకంలో డివిజన్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని కార్పొరేటర్ తెలిపారు. థీమ్ పార్కును రూ.70 లక్షల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.