ఘట్కేసర్, మార్చి 14 : ఘట్కేసర్ మున్సిపాలిటీలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ మంత్రి కేటీఆర్‌ను కోరారు. సోమవారం పీర్జాదిగూడ కార్పొరేషన్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చైర్పర్సన్ కలిసి వినతిపత్రం అందజేశారు.మున్సిపాలిటీలో ప్రధాన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.19 కోట్ల,75 లక్షలు మంజూరు చేయాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందించిన మంత్రి అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు చైర్పర్సన్ ధన్యవాదాలు తెలిపారు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీకి…
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 8,9వ వార్డులో సివరేజీ పైపులైన్ మిగులు పనులకు నిధులు కేటాయించాలని మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. నాసిన్ చెరువు కింద ఉన్న 8, 9వ వార్డు ప్రజలు వర్షాలు పడినప్పుడు ఇబ్బందులు పడుతున్నారని, ఈ వార్డులో పైపులైన్ మిగులు పనులకు నిధులు కేటాయించాలని మంత్రిని చైర్పర్సన్ కోరారు.