మేడ్చల్ రూరల్, మార్చి 11: హైదరాబాద్‌కు ఉత్తరాన ఐటీ పరిశ్రమకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, విస్తరణను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూయర్స్ అసోసియేషన్ (కేఐటీఈఏ) నిర్ణయించింది. ఈ మేర కు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటి కండ్లకోయలో కైటియా సభ్యులు సమావేశమై, దీనిని తీర్మానించారు. హైదరాబాద్ నగరానికి ఉత్తరాన ఉన్న కండ్లకోయలో గేట్ వే ఐటీ పార్కు నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ శం కుస్థాపన చేసిన తర్వాత మొదటిసారి కైటియా శుక్రవారం సమావేశమైంది. ఉత్తరాన పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించింది. ఈ సందర్భంగా కైటియా అధ్యక్షుడు ఓరుగంటి వెంక ట్ మాట్లాడుతూ, గేట్ వేలో ప్రతిపాదిత 6 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఐటీ పార్కు శంకుస్థాపన కంటే ముందే ఐ టీ కంపెనీలు రిజర్వు చేసుకున్నాయన్నారు.
ఇంకా తమకు స్థలం కేటాయించాలని వివిధ కంపెనీల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న స్థలానికి అదనంగా సమీపంలో ఉన్న అటవీ, ఎలక్ట్రిసిటీ బోర్డు, ప్రైవేట్ స్థ లాన్ని సేకరించి, అందించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ ఈసీ చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, టీఎస్ఐఐసీ అధికారులను కోరుతున్నామన్నారు. ‘గేట్ వే’కు సమీపంలో ఉ న్న ఆ స్థలాలను సేకరిస్తే దాదాపు 50 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తద్వారా ఐటీ పరిశ్రమ మరింత వృద్ధి చెంది, అన్ని రకాల సేవలు ఇక్క డి నుంచి అందించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే, ఐ టీ పార్కులో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు 10 కిలో మీటర్ల పరిధి వరకు సైక్లింగ్ ట్రాక్‌లు, 5 కిలో మీటర్ల వరకు వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, టీఎస్ఐఐసీకి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ వెంకట నర్సింహారెడ్డి ముందుంచనున్నట్టు తెలిపారు.
రానున్న 5-10 ఏళ్ల కాలంలో అధునాతన సదుపాయాలతో పర్యావరణానికి ఎ లాంటి హాని కల్గించకుండా హైదరాబాద్ ఉత్తర భాగంలో మరో హైటెక్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆయ న కోరారు. కైటియా తరుపున జాబ్‌మేళాలు, పెట్టుబడిదారుల సమావేశాలు, సైక్లింగ్, రన్నింగ్, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో నిర్వహించి, ఉత్తర భాగంలో ఐటీ అభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి వివరిస్తామన్నారు. అలాగే సీఐఐ, అసోచామ్, నాస్కాం, హై సియా, టాస్క్, ఎన్ఎస్డీసీ తదితర సంస్థలతో అనుసంధానమై మార్గదర్శనం తీసుకుంటామని ఆయన చెప్పారు.