మణికొండ/బండ్లగూడ/శంషాబాద్ రూరల్/ మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 9 : రాష్ట్రంలోని అందరి గురించి అలోచించే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని మేయర్ మహేందర్‌గౌడ్ అన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆరెమైసమ్మ దేవాలయం వద్ద కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు గోపాల్, రాజు, లక్ష్మీబాయి, పాండు, నర్సింగ్‌రావు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మణికొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటన చేయడంపై మణికొండ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగులలో హర్షాతిరేకాలు వెళ్లివిరిశాయి. బుధవారం మణికొండ మర్రి చెట్టు కూడలిలో కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ మున్సిపాలిటీ ఫ్లోర్‌లీడర్ కె. రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బుద్దోలు శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సీఎం ఏసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నవీ న్ కుమార్ , మైనార్టీ విభాగం అధ్యక్షుడు బ షీర్ , నాయకులు లక్ష్మీనారాయణ, మల్లేశ్ , శ్రావణ్, గణేశ్, ఏర్పు ల కుమార్, శ్రీకాంత్, దిలీప్, సిద్దు, లక్ష్మిశ్రీ, లక్ష్మణ్‌గౌడ్, వై కిరణ్, సురేఖ, భరత్, భవాని, శ్రీనివాస్, లక్ష్మ య్య, శివగంగ,ఆరీఫ్, చంద్రశేఖర్, శివ, శంకర్‌సింగ్, అంజి తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తూ టీఆర్ఎస్ నాయకులు బుధవారం శంషాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటాపికి క్షీరాభిషేకం చేశారు. అంతేగాక కాంట్రాక్టు ఉద్యోగులను సైతం పర్మినెంట్ చేస్తామని ప్రకటించడం హర్షణీయమని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, నీరటిరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి : నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అద్యక్షుడు టి. ప్రేమ్‌గౌడ్ అన్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సరికొండ వెంకటేశ్, రాముగౌడ్, రాఘవేందర్, సోమ శ్రీను, మైసయ్య, లక్ష్మీరాజ్, అర్జున్, జగదీశ్, రాజుముదిరాజ్, గట్టయ్య, ఈశ్వర్ పంతులు, రాజేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఓసీలకు రిజర్వేషన్లు కల్పించడం అభినందనీయం
బండ్లగూడ, మార్చి 9 : డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక పరీక్షలు రాసి ఉద్యోగం కోసం ఎదురు చూసి ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అందులోనూ తను ఓసీని కావడంతో ఉద్యోగం రాదేమోనని బాధ పడేవాన్ని కాని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన చేయడంతో పాటు ఓసీలకు కూడా రిజర్వేషన్లను కల్పించడం అభినందనీయం.
చాలా ఆనందంగా ఉన్నది..
ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తాననడంతో చాలా ఆనందంగా ఉన్నది. డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లవుతుంది. ఇంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు వెళ్లలేక, ప్రైవేటు ఉద్యోగం కొరకు నగరంలో అనేక చోట్లకు తిరిగి అలసి పోయా. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఏదో ఉద్యోగం సంపాధించి అమ్మనాన్నలకు అండగా ఉంటాననే నమ్మకం ఏర్పడింది.