మియాపూర్, మార్చి 9 : భారీ ఉద్యోగాల భర్తీ ప్రకటన ద్వారా నిరుద్యోగుల కలలను తమ సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా స్వపరిపాలనను సాధించిన ఆయన ఆ దిశగా విజయవంతంగా ముందడుగు వేస్తు అన్ని వర్గాల ప్రజలను సంతోషపెడుతున్నారన్నారు. అసెంబ్లీ వేదికగా వివిధ విభాగాల్లో 91 వేల పై చిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ బుధవారం నాటి ప్రకటన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్టలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, పార్టీ నేతలతో కలిసి విప్ గాంధీ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాలుస్తూ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ఇప్పటికే 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన సీఎం తాజాగా మరో 90 వేల ఉద్యోగాలకు ప్రకటన చేయడం అత్యంత సంతోషకరమని, ఈ ప్రకటనతో నిరుద్యోగులలో ఆనందాలు వెళ్లివిరుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్ ఉంటుందని మరోసారి సీఎం కేసీఆర్ నిరూపించారని, మున్ముందు మరిన్ని అవకాశాలు వారి వద్దకు రానున్నాయన్నారు.
సాగు సహా ఇతర అన్ని రంగాలను పురోగతిలో ముందుకు నడిపిస్తూ యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తూ విజయవంతంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, ఇది ఆయన పాలనా దక్షతకు నిదర్శమని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఉమ్మడి పాలనలో యువతకు జరిగిన అన్యాయాన్ని సహించలేకే ప్రజాశక్తితో పోరాడి వారికి అండగా నిలిచారని విప్ గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గ నిరుద్యోగుల తరపున సీఎం కేసీఆర్‌కు విప్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజేందర్, సత్యనారాయణ, ఖదీర్, బాలయ్య, కుమారస్వామి, సుబ్బారావు, పరమేశ్వర్రావు, శ్రీనివాసరావు, రంగరాజు, వెంకటేశ్వర్రావు, మహిళా ప్రతినిధులు కృష్ణకుమారి, విమల, స్వప్న, పర్వీన్, మాధవి, లక్ష్మి, ఏలేంద్ర, శృతి, తదితరులు పాల్గొన్నారు.
మేలు చేకూరేలా వేలాది ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ సీఎం కేసీఆర్ నోటిఫికేషన్లను జారీ చేసి ఉత్సాహం నింపిన సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాలుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు శ్రీకళ, పర్వీన్ భేగం, నాయకులు భాగ్యలక్ష్మి, సౌజన్య, నాజియా, సుధారాణి, రోజా రాణి, అరుణ, గిరిజ, లక్ష్మణ్ యాదవ్, ఆంజనేయులు, బస్వరాజ్, బసవయ్య, వెంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యోగ ప్రకటన నిరుద్యోగులకు వరం
సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పయనిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. అన్ని శాఖల్లో 91,144 పోస్టుల భర్తీ చేయడం నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. ఎంతో కాలంగా ప్రభుత్వ సర్వీసుల్లో చేరాలన్న బలమైన కాంక్షతో నిరుద్యోగులు శ్రమిస్తున్నారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం కావడంతో నిరుద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
వయోపరిమితి పెంచడంతో ఊరట
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టడంతో పాటు వయోపరిమితిని సీఎం కేసీఆర్ పెంచడం హర్షణీయం. నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయం పనిచేస్తున్న సీఎం నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడంతో ప్రభుత్వ ఉద్యోగ చేయాలనే కలను సాకారం చేసుకునే అవకాశం కలిగింది. సీఎం ప్రకటనతో ఎంతో మందికి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవకాశం దొరుకుతుంది.